ఓటీటీ లో అదరగొడుతున్న ‘విట్నెస్ ‘….
ఈ మధ్య కాలంలో సినిమాలతో సమానంగా వెబ్ సిరీస్ పోటీ పడుతున్నాయి. కంటెంట్, ఎంటర్టైన్మెంట్ లో పెద్ద సినిమాలకి ఏ మాత్రం తీసిపోని విధంగా వెబ్సెరీస్ ని రూపొందిస్తున్నారు. థియేటర్ లో రిలీజైన మూవీస్ తో ఈక్వల్ గా ఓటీటీలో రిలీజైన సిరీస్ ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాయి. పెద్ద ఎత్తున రిలీజ్ అవుతున్న సినిమాలు, సిరీస్ లు ఓటీటీ లో సందడి చేస్తూ కాసుల వర్షాన్ని కురిపిస్తున్నాయి.
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల్లో ‘విట్నెస్’ ఒకటి. ఈ సినిమా సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాల్సిన సినిమాగా టాక్ తెచ్చుకుంది విట్నెస్. సినిమా చూసిన వాళ్ళందరూ మంచి రివ్యూస్ ఇవ్వడంతో , రిలీజైన వారంలోనే పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది. అందుకే సోనీ లివ్ లో ఈ సినిమాకి ప్రేక్షకుల ఆదరణ లభిస్తుందని కామెంట్స్ వస్తున్నాయి.
సోషల్ మీడియాలో విపరీతంగా విట్నెస్ సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి. దీంతో ఈ సినిమా పై వ్యూయర్స్ దృష్టి పడి, మంచి రేటింగ్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో శ్రద్ధ రామ శ్రీనాథ్ లీడ్ రోల్ చేయగా, ముఖ్య పాత్రల్లో రోహిణి ,షణ్ముగ రాజా, రాజీవ్ ఆనంద్ కనిపించారు. టీజి. విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 9 నుండి సోనీ లివ్ లో ప్రసారమవుతూ ప్రేక్షకుల ని మెప్పిస్తుంది.













