Spirit: స్పిరిట్ సినిమాలో తమిళ యాక్టర్?

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్(prabhas) చేతిలో ప్రస్తుతం పలు సినిమాలు ఉన్నాయి. ప్రభాస్ ఇప్పుడు మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్(the raja saab) తో పాటూ హను రాఘవపూడి(hanu raghavapudi) దర్శకత్వంలో ఫౌజి సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తవగానే ప్రభాస్, అర్జున్ రెడ్డి(arjun reddy), యానిమల్(animal) ఫేమ్ సందీప్ రెడ్డి వంగా(Sandeep reddy vanga) దర్శకత్వంలో స్పిరిట్(spirit) అనే పాన్ ఇండియా సినిమా చేయనున్నాడనే విషయం తెలిసిందే.
ఈ సినిమాలో ప్రభాస్ ఓ పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించనున్నాడని ఇప్పటికే సందీప్ వెల్లడించాడు. దీంతో స్పిరిట్ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా? ఎప్పుడెప్పుడు రిలీజవుతుందా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు స్పిరిట్ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది.
స్పిరిట్ సినిమాలో సందీప్ రెడ్డి వంగా ఓ స్పెషల్ పాత్రను డిజైన్ చేస్తున్నాడని, ఆ క్యారెక్టర్ కోసం ఓ తమిళ హీరోను తీసుకోవాలని మేకర్స్ ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ఈ వార్తల్లో నిజమెంతనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ నిజమే అయితే ప్రభాస్ సినిమాలో ఛాన్స్ దక్కించుకునే ఆ హీరో ఎవరూ కూడా చూడాలి. త్రిప్తి డిమ్రి(tripti dimri) హీరోయిన్ గా నటించనున్న స్పిరిట్ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్(Harshavardhan rameswar) సంగీతం అందిస్తున్నాడు.