నిధి అగర్వాల్ కు అరుదైన గౌరవం
సవ్యసాచి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది అందాల తార నిధి అగర్వాల్. రెండో సినిమాతో అక్కినేని హీరోతో ఆడిపాడిన ఈ బ్యూటీ తక్కువ సమయంలోనే నటిగా మంచి పేరు సంపాదించుకుంది. ఇక రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ఈస్మార్ట్ శంకర్ తో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ప్రస్తుతం ఈ భామ కోలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ దూసుకెళుతోంది. అంతేకాకుండా క్రిష్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసిన విషయం తెలిసిందే. తాజాగా నిధి అగర్వాల్ అభిమానుల నుంచి విలువ కట్టలేని అందమైన బహుమానాన్ని అందుకుంది.
తమ అభిమాన నటి నిధికి తెలుగు తమిళ అభిమానులు కలిసి ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున చెన్నైలో విగ్రహం చేయించి గుడి కట్టారు. అంతేగాక విగ్రహానికి పాలాభిషేకం చేసి పూజలు చేశారు. అనంతరం కేక్ కట్ చేయించారు. ఈ విషయాన్ని ట్విటర్లో నిధి ఫ్యాన్స్ క్లబ్ షేర్ చేయగా.. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎంత అభిమానం ఉంటే ఇలా విగ్రహం ప్రతిష్టించి పూజలు చేస్తారని నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరి ఈ విషయం నిధి దాకా చేరిందో లేదో తెలీదు. ఒకవేళ తెలిస్తే ఎలా స్పందిస్తుదో వేచిచూడాలి.













