తమన్నా స్పెషల్ సాంగ్ చేస్తే మూవీ హిట్టే!
టాప్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కోసం హీరోయిన్ ను కాకుండా వేరేగా ఓ హీరోయిన్ ను తీసుకొచ్చి హీరోతో స్టెప్పులేయించడం ఇప్పుడు కొత్తగా వచ్చిందేమీ కాదు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారిపోయి ఏకంగా మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్సే ఆ బాధ్యతను తీసుకుని ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. అలా చేసిన హీరోయిన్స్ లో తమన్నా ఆయా సినిమాలకు హిట్ సెంటిమెంట్ గా మారింది.
తమన్నా స్పెషల్ సాంగ్స్ చేసిన ట్రాక్ రికార్డు చూస్తే ఈ విషయం అర్థమైపోతుంది. రీసెంట్ గా రజనీకాంత్ జైలర్ లో నువ్ కావాలయ్యా సాంగ్ ఎంతపెద్ద హిట్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది. దానికి ముందు మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు లో డాంగ్ డాంగ్ అనే స్పెషల్ సాంగ్ చేసింది. ఆ సినిమా కూడా హిట్టే.
ఇక కెజిఎఫ్ చాప్టర్1 సౌత్ వెర్షన్ లో కూడా తమన్నా మెరిసింది. చిన్న సినిమాగా వచ్చిన కెజిఎఫ్ ఎవరూ ఊహించనంత హిట్ అయింది. ఇవి కాకుండా గతంలో జై లవకుశలో, బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు శీను లో కూడా తమన్నా స్పెషల్ సాంగ్స్ చేసింది. ఆ సినిమాలు కూడా హిట్టే. మధ్యలో గని లాంటి సినిమాల రూపంలో షాకులున్నప్పటికీ హిట్ పర్సెంటేజే ఎక్కువుంది. ఇక అసలు విషయానికొస్తే వచ్చే నెల 15న రిలీజ్ కానున్న బాలీవుడ్ మూవీ స్త్రీ2 లో తమన్నా ఆజ్ కీ రాత్ అనే సాంగ్ చేసింది. ఇప్పటికే ఈ సాంగ్ నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది. అందాలను ఆరబోస్తూ తమన్నా వయ్యారంగా వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. స్త్రీ2 మార్కెటింగ్ లో తమన్నా పాట కీలకమైపోయింది. మరి స్త్రీ2 తమన్నా హిట్ సెంటిమెంట్ ను రిపీట్ చేస్తుందా లేదా అన్నది చూడాలి.













