విక్కీతో డేటింగ్ చేయడం అంటే ఇష్టం … తమన్నా
రాజీ, ఊరి ది సర్జికల్ స్రైక్ చిత్రాలతో దేశం దృష్టిని ఆకర్షించిన నటుడు విక్కీ కౌశల్. ఇప్పుడీ యువ కథానాయకుడికి బోలెడంతమంది అభిమానులు. ఆయనతో సినిమాలు చేయడానికి దర్శకనిర్మాతలు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఆయన సరసన నటించడానికి కథానాయికలూ తహతహలాడుతున్నారు. ఇప్పుడీ యువ కథానాయకుడిపై మన అవంతిక కూడా మనసు పడింది. అదేనండీ, బాహుబలి నాయిక తమన్నా. దక్షిణాది సీనియర్ కథానాయికగా వెలిగిపోతున్న తమన్నా బాలీవుడ్లోనూ మెరిసింది. ఈ మధ్య ఇంటర్వ్యూలో బాలీవుడ్ ఎవరితో డేటింగ్ చేయడం అంటే ఇష్టం అన్న ప్రశ్నకు ఆమె సూటీగా విక్కీ కౌశల్ అని చెప్పి అందర్ని ఆశ్చర్యపరిచింది. ఈ మాట తమన్నా సరదాగా అందో.. నిజంగానే చెప్పిందో అంటూ అభిమానుల్లో చర్చ మొదలైంది.













