త్వరలో పెళ్లిపీటలెక్కనున్న తమన్నా…?
సాధారణంగా హీరోయిన్లు ముదురు వయసు వస్తే గానే పెళ్లి అనే టాపిక్ ని టచ్ చేయరు. మంచి ఫామ్ లో ఉన్నపుడే చాలా మంది హీరోయిన్లు ఇల్లు చక్కబెట్టుకుంటారు. ఇప్పుడిక పెళ్లి విషయంలో మిల్కీ బ్యూటీ టర్న్ వచ్చేసింది. ఈ మధ్య ఈమె పెళ్లి గురించి రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్తను తమన్నా పెళ్లాడబోతుందని నెట్టింట వార్తలు జోరుగా సాగుతున్నాయి.
ఈ వార్తలన్నిటికీ చెక్ పెడ్తూ తమ్ము చాల ఫన్నీగా స్పందించింది. నాకు పెళ్లి సంబంధం చూసినందుకు చాలా థాంక్స్ అని ఆమె మీడియా , సోషల్ మీడియాకి ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. అందరి ఇంట్లో లాగానే తనకి పెళ్ళి సంబంధాలు చూస్తున్నారని తమన్నా ఓపెన్ అవ్వడం విశేషం. తన పర్సనల్ లైఫ్ గురించి ఈ అమ్మడు ఆసక్తికర విషయాలు చెప్పింది.
తాజా చిత్రం ” గుర్తుందా శీతాకాలం ” ప్రమోషన్స్ లో భాగంగా తమన్నా మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకి ఆవిడ ఈ విధంగా సమాధానం ఇచ్చారు. మాములుగా అందరిళ్ళల్లో అమ్మాయిలకి పెళ్లి విషయంలో ఎంత ప్రెషర్ ఉంటుందో తెలుసుగా , నేను అందుకు మినహాయింపు కాదు.
నిజం చెప్పాలంటే మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు. కానీ నేను ఇంకా వాళ్ళకి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు అని తమన్నా వెల్లడించారు. సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్ ని నేనంతగా పట్టించుకోను, రూమర్స్ పుట్టించడం, కామెంట్స్ చేయడం వారి జీవితంలో ఒక భాగం అన్నారు మిల్కీ బ్యూటీ. ఈ అమ్మడి పెళ్లి చూడాలంటే ఫాన్స్ ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందేనని అర్ధమవుతుంది.













