ఫిబ్రవరి 14 న తమన్నా, విజయ్ వర్మల ఎంగేజ్ మెంట్?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్, మిల్కీ బ్యూటీ తమన్నా గురించి తెలియని వారుండరు. తన అందచందాలతో, నటనతో తెలుగు ఆడియన్స్ ని కట్టిపడేసిన బ్యూటీ తమన్నా భాటియా. యంగ్ హీరోల నుండి, సీనియర్ హీరోల వరకు దాదాపు అందరి హీరోలతో జత కట్టింది ఈ అమ్మడు. టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ లో సైతం తమన్నా తన సత్తా ఏంటో చూపించింది. మిల్కీ బ్యూటీ గా కుర్రకారు గుండెల్లో నిలిచిపోయింది ఈ ముద్దుగుమ్మ. తన క్రేజ్ తో ఇప్పటికి కూడా కెరీర్ లో ఎక్కడా తగ్గేదేలేదంటూ దూసుకుపోతుంది.
ఈ మధ్య సోషల్ మీడియాలో మిల్కీ బ్యూటీపై ఒక వార్త హల్చల్ చేస్తుంది. వాలెంటైన్స్ డే రోజున ఈ అమ్మడి ఎంగేజ్మెంట్ జరగబోతుంది అంటూ నెట్టింట వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. ప్రముఖ బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్నా నిశ్చితార్థం జరగనున్నట్లు సమాచారం అందుతుంది. స్వతహాగా తెలుగు వాడైనటువంటి విజయ్ వర్మ హిందీలో సినిమాలు చేస్తూ అక్కడే స్థిరపడిన విషయం తెలిసిందే. గత కొద్ది కాలంగా వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లు సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఈ వార్త ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లోను హాట్ టాపిక్ గా మారింది. కొద్దిమంది సన్నిహితుల మధ్య ఈ జంట ఒక్కటి కాబోతున్నారంటూ రూమర్స్ వస్తున్నాయి. కానీ, ఇప్పటి వరకు మిల్కీ బ్యూటీ నుండి కానీ విజయ్ వర్మ నుండి కానీ ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ రాలేదు. వీరిరువురు కూడా ఈ న్యూస్ ని చూసి చూడనట్లు వదిలేయడం విశేషం. తమన్నా అప్ కమింగ్ టాలీవుడ్ మూవీ భోళా శంకర్ షూటింగ్ కోసం వెయిట్ చేస్తుండగా, బాలీవుడ్ లోని కొత్త ప్రాజెక్ట్స్ లో విజయ్ వర్మ బిజీ గా ఉన్నట్లు తెలుస్తుంది. ఇంతకీ ఈ వార్త నిజమా? లేక రూమరా? అని తెలియాలంటే ఫిబ్రవరి 14 వరకు వెయిట్ చేయాల్సిందే.













