Rambha: తమన్నా వల్లే నా భర్తను ఫాలో అవడం లేదు

ఆ ఒక్కటి అడక్కు(Aa Okkati Adakku) సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రంభ(Rambha) మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆ తర్వాత కూడా రంభ నటించిన సినిమాలు హిట్ అవడంతో ఆమెకు తక్కువ కాలంలోనే స్టార్ హీరోలందరి సరసన నటించే అవకాశం దక్కింది. సౌత్ లోని స్టార్ హీరోలందరితో కలిసి నటించిన రంభ గ్లామర్ పాత్రల్లో నటించి స్పెషల్ ఐడెంటిటీని సొంతం చేసుకుంది.
కేవలం హీరోయిన్ గానే కాకుండా పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో మెరిసి అందరినీ ఆకట్టుకున్న రంభ తెలుగుతో పాటూ తమిళం, హిందీ, మలయాళం, బెంగాలీ, భోజ్‌పురి భాషల్లో సినిమాల్లో నటించింది. కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న రంభ ఇప్పుడు రీఎంట్రీ ఇవ్వాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఇంటర్వ్యూలిస్తూ ఫోకస్ అవుతుంది.
తాజాగా రంభ ఓ ఇంటర్వ్యూలో తన భర్త గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో రంభ తన భర్తను ఫాలో అవదట. దానికి కారణం ఓ హీరోయిన్ అని కూడా ఆమె వెల్లడించింది. తన భర్త తమన్నా(tamannaah)ని ఫాలో అవుతున్నాడనే కారణంతో అతన్ని సోషల్ మీడియాలో ఫాలో అవడం లేదని, ఆమె ఫాలో అవకపోయినా తన భర్త మాత్రం ఆమెను ఫాలో అవుతున్నాడని సరదాగా చెప్పింది రంభ.