రాజుగారి గదికి తమన్నా గ్రీన్ సిగ్నల్
కొనసాగింపు చిత్రాలు తెలుగు చిత్రసీమకి అలవాటే. అయితే హిందీలో ఫ్రాంచైజీలుగా వరుసగా సినిమాలు రూపొందుతుంటాయి. తెలుగు చిత్రసీమ అదే దారిలో నడవబోతోంది. పలువురు దర్శకులు తమ చిత్రాల్ని ఫ్రాంచైజీలుగా వరుసగా కొనసాగించాలనే ఆలోచనలతో ఉన్నారు. తాజాగా రాజుగారి గది కి కొనసాగింపుగా మూడో చిత్రం కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన రెండు చిత్రాలు ప్రేక్షకుల మెప్పు పొందాయి. త్వరలోనే రాజుగారి గది 3ని పట్టాలెక్కించాలనే ఆలోచనలో ఉన్నారు దర్శకుడు ఓంకార్. అందులో కథానాయికగా అగ్ర తార తమన్నా నటించబోతోందని సమాచారం. ఎఫ్2తో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకొన్న తమన్నా, ఇటీవలే రాజుగారి గది 3 కథ విని అంగీకారం తెలిపినట్లు సమాచారం. రాజుగారి గది 2లో సమంత నటించిన సంగతి తెలిసిందే.













