Tamannaah: మిల్కీ బ్యూటీ ట్యాగ్ పై మాట్లాడిన తమన్నా
ఎప్పుడో 20 ఏళ్ల కిందట హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తమన్నా(Tamannaah) ఇప్పటికీ అవకావాలు అందుకుంటూనే ఉంది. ఒకప్పుడు సౌత్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన తమన్నాను ఆడియన్స్ మిల్కీ బ్యూటీ అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. రీసెంట్ గా ఓదెల2 సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన తమన్నా ఆ చిత్ర ప్రమోషన్స్ లో మిల్కీ బ్యూటీ(Milky Beauty) ట్యాగ్ పై మాట్లాడింది.
తనకు మిల్కీ బ్యూటీ అనే ట్యాగ్ అభిమానులే ఇచ్చారని, తర్వాత అదే వాడుకలోకి వచ్చిందని చెప్పిన తమన్నా మీడియా ప్రచారం వల్ల మిల్కీ బ్యూటీ ట్యాగ్ అందరికీ తెలిసిందని చెప్పింది. అలా అని ఆ ట్యాగ్ ప్రభావం తన సినిమాలపై ఎప్పుడూ చూపించలేదని, తన కెరీర్లో ఎన్నో విభిన్న రకాల పాత్రలు చేశానని తమన్నా ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది.
అందంగా ఉన్నానని తనకు ఛాన్సులొచ్చాయని చెప్పుకోవడం తనకు అసలు ఇష్టముండదని, ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అందాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పిన తమన్నా, తనను అందరూ అందంతో కాకుండా తన టాలెంట్, పాత్రలతో గుర్తు పెట్టుకోవాలని, దాని కోసమే తాను ప్రతీ క్షణం కష్టపడుతున్నానని, అదే తన టార్గెట్ అని తమన్నా తెలిపింది.













