Tamannaah: గోల్డెన్ ఫ్రాకులో మెరిసిపోతున్న మిల్కీ బ్యూటీ

మిల్కీ బ్యూటీ టాలెంట్, అందం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రీసెంట్ గా ఓదెల2(Odela2) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన తమన్నా(Tamannaah) ఆ సినిమాతో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తమన్నా తన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్లకు టచ్ లోనే ఉంటుంది. తాజాగా అమ్మడు బ్లింగ్ ఇట్ ఆన్ అనే క్యాప్షన్ తో ఓ అద్భుతమైన ఫోటోను షేర్ చేసింది. మెట్ల మీద కూర్చుని అందమైన తెలుపు, గోల్డ్ కలర్ గౌన్ వేసుకుని దానికి తగ్గ జ్యుయలరీ వేసుకుని ఎంతో అందంగా, మరింత స్టైలిష్ గా కనిపించింది. ఈ డ్రెస్ లో తమన్నా మరింత అందంగా కనిపిస్తుందని నెటిజన్లు ఆ ఫోటోకు కామెంట్స్ చేస్తున్నారు.