Tamannaah: తెరపై ఆ హీరోయిన్ పాత్ర చేయాలనుందంటున్న తమన్నా
హీరోయిన్ శ్రీదేవి(Sridevi)కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ చెప్పేది కాదు. ఎంతోమంది సెలబ్రిటీలు కూడా శ్రీదేవిని అభిమానిస్తుంటారు. ఇటీవలే ఓ ఫ్యాషన్ టూర్ లో భాగంగా తమన్నా(Tamannaah) తనకు శ్రీదేవి పాత్రను తెరపై చేయాలనుందని తెలిపింది. ఆమె సూపర్ ఐకానిక్ అని, అందుకే ఆమె స్క్రీన్ పై ఆమె పాత్రను చేయాలని ఉన్నట్టు తమన్నా చెప్పింది.
ఆమెను ఆరాధించే వ్యక్తుల్లో తాను కూడా ఒకరని చెప్పిన తమన్నా ఆమె ప్రతీ జానర్ లో ఎన్నో రకమైన పాత్రల్లో నటించి ఇండియన్ సినీ చరిత్రలో ఫస్ట్ లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందారని, వివిధ భాషల్లో 50 సంవత్సరాలకు పైగా అన్ని ఎన్నో రంగాల్లో కొనసాగారని, ఖుదా గవా(Kudha Gava), లాడ్లా(Laadla), మిస్టర్ ఇండియా(Mr India) లాంటి ఐకానిక్ సినిమాల్లో ఆమె నటించారని తమన్నా తెలిపింది.
ఇక తమన్నా కెరీర్ విషయానికొస్తే తాను నీరజ్ పాండే(Neeraj Pandey) దర్శకత్వంలో సికిందర్ కా ముఖద్దర్(Sikindar Ka mukhaddhar) సినిమాలో నటించింది. తెలుగులో ఓదెల2(Odela2) సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది తమన్నా. అశోక్ తేజ(Ashok Teja) దర్శకత్వం వహిస్తున్న ఓదెల2 కు డైరెక్టర్ సంపత్ నంది(Sampath Nandi) కథ అందించడంతో పాటూ ఆయనే ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రీసెంట్ గా రిలీజైన ఓదెల2 టీజర్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.













