గది నుంచి మిల్కీ తప్పుకుందా?
అనూహ్యంగా బాలీవుడ్ ప్రాజెక్టులో తమన్నాకు చాన్స్ దక్కడంతో ఇక్కడ చేస్తున్న ఒక తెలుగు ప్రాజెక్టును దూరం పెట్టినట్టు తెలుస్తోంది. అయితే, ప్రాజెక్టులో తన పాత్రకు తగిన ప్రాధాన్యత లేకపోవడం వల్లే తప్పుకున్నట్టు వార్తలు పొక్కుతున్నా..అసలు విషయం మాత్రం అక్కడ చేతికందిన ప్రాజెక్టుతో బాలీవుడ్‌పై ఫోకస్ పెంచడమేనని అంటున్నారు. హారర్ థ్రిల్లర్ ప్రాజెక్టులకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన తమ్మూ బేబీ ఓంకార్ దర్శకత్వంలో రాజుగారి గది 3కి సైన్ చేసింది. మంచి విజయం సాధించిన రాజుగారి గది చిత్రాకిని సీక్వెన్స్ సీక్వెల్‌గా వస్తున్న ఈ ప్రాజెక్టుకు ఇటీవలే పూజా కార్యక్రమాలు నిర్వహించారు కూడా. అయితే స్క్రిప్ట్ సిద్ధమవుతున్న టైంలో మిల్కీ బ్యూటీకి చెప్పిన కథ వేరని, పైనల్ వర్షన్లో ఆమె పాత్రకు ప్రాధాన్యత లేకుండా పోవడం వల్లే అమెకు కోపం వచ్చి ఉండొచ్చన్న కథనాలు వినిపిస్తున్నాయి. అసలు విషయం మాత్రం బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టేందుకే ఈ ప్రాజెక్టును తమన్నా వదులుకుంటోందన్న వాదనా లేకపోలేదు. బాలీవుడ్ వర్సటైల్ ఆర్టిస్ట్ నవాజుద్దీన్ సిద్ధిఖీతో అతని సోదరుడు తెరక్కిస్తోన్న ఓ ప్రాజెక్టులో తమన్నాకు చాన్స్ దక్కడం తెలిసిందే. కొత్తగా వినిపిస్తోన్న కథనాలపై చిత్రబృందం ఏమంటుందో చూడాలి.













