మిల్కీ బ్యూటీ కీలక నిర్ణయం
తన పెంపుడు కుక్క అనారోగ్యంతో పాలవడంతో మిల్కీ బ్యూటీ తమన్నా కీలక నిర్ణయం తీసుకున్నారట. తమన్నా కొన్నేళ్లుగా లాబ్రాడూడుల్ జాతికి చెందిన ఓ కుక్కను పెంచుకుంటున్నారు. దాని పేరు పెబెల్స్. కాగా కొన్ని రోజుల క్రితం పెబెల్స్ మాంసాహారం తినడంతో తీవ్ర అనారోగ్యానికి గురైందట. వైద్యుల వద్దకు తీసుకెళితే పారాలిటిక్ ఎటాక్ వచ్చిందని చెప్పారట. దాంతో తన కుక్కకు మాంసాహారం పెట్టడం మానేశారట. తాను కూడా పూర్తిగా వెజిటేరియన్‌గా మారిపోయానని పేర్కొన్నారు. తన కుటుంబంలో మాంసాహారాన్ని ఎక్కువగా ఇష్టపడతారని, తాను తీసుకున్న నిర్ణయాన్ని పాటించడం కాస్త కష్టమే అయినా విల్ పవర్‌తో ఏదైనా సాధించవచ్చని తెలిపారు. 2014లో తమన్నా, అక్షయ్ కుమార్ జంటగా ఇట్స్ యాన్ ఎంటర్టైన్మెంట్ సినిమాలో నటించారు. ఈ సినిమాలో లాబ్రడార్ జాతికి చెందిన ఓ కుక్క టైటిల్ పాత్రలో నటించింది. సినిమా చిత్రీకరణ పూర్తయ్యేవరకు ఆ కుక్క తమన్నా, అక్షయ్‌తోనే ఉంది. అప్పటి నుంచి తమన్నాకు కుక్కల పట్ల ప్రేమ పెరిగింది. ఈ సినిమా తర్వాతే ఆమె లాబ్రాడూడుల్ జాతికి చెందిన కుక్కను తెచ్చుకున్నారట.













