తమన్నా కల నెరవేరనుంది
మెగాస్టార్ చిరంజీవితో నటించాలనే మిల్కీబ్యూటీ తమన్నా కల త్వరలోనే నెరవేరనుంది. ప్రస్తుతం చిరంజీవి చేస్తున్న సైరా సినిమాలో యోధురాలి పాత్రకుగాను దర్శక నిర్మాతలు ఈ బ్యూటీని ఎంపికచేశారు. ఈ పాత్ర సినిమాలో ఎంతో కీలకంగా ఉంటుందట. వచ్చే వారం జరుగనున్న షూటింగ్లో తమన్నా పాల్గొనబోతోంది. హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలోని రామానాయుడు స్టూడియోస్‌లో వేసిన ప్రత్యేకమైన సెట్స్‌లో ఈ షూటింగ్ జరుగనుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రూ.200 కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు రామ్‌చరణ్. అబ్బురపరిచే గ్రాఫిక్స్ ఉండే చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా నయనతార నటిస్తుండగా అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, రవికిషన్ వంటి స్టార్లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.













