మిల్కీ బ్యూటీకి మరో లక్కీ ఆఫర్
మిల్కీ బ్యూటీ తమన్నాకు మరో లక్కీ ఆఫర్ వచ్చింది. ఈ భామ మరోసారి ఐటమ్‌సాంగ్‌లో మెరవనుంది. కన్నడ యంగ్ హీరో యశ్ నటిస్తున్న బహుభాషా చిత్రంలో ఈ మిల్కీబ్యూటీ అదిరిపోయే ఐటమ్‌సాంగ్ చేస్తోందట. 2016లో విడుదలైన కన్నడ చిత్రం జాగ్వార్ లో తమన్నా ఐటమ్‌సాంగ్ చేసి మురిపించింది. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు కన్నడ సినిమాలో స్పెషల్ ఐటమ్‌సాంగ్ ఛాన్స్ దక్కించుకుంది. ఈ చిత్రాన్ని కన్నడతో పాటు తెలుగు, తమిళ్, హిందీ, మలయాళంలో భారీగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బాహుబలి అవంతికగా అన్ని భాషల్లోనూ సుపరిచితమైన తమన్నా చేసే ఐటమ్‌సాంగ్ తమకు లాభిస్తుందని సినిమా యూనిట్ భావిస్తోంది. అయితే ఈ సాంగ్ కోసం ఈ బ్యూటీ భారీ పారితోషికాన్ని అందుకుందట.













