టాలీవుడ్ సెలబ్రిటీస్‌తో తమన్నా టాక్ షో!
మంచు మనోజ్ హీరోగా నటించిన `శ్రీ` చిత్రంతో హీరోయిన్గా టాలీవుడ్లో హీరోయిన్గా పరిచయమైన అందాల భామ తమన్నాఇండస్ట్రీకి వచ్చి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 2005లో `చాంద్ సా రోషన్ చెహ్రా` అనే హిందీ చిత్రంతో చిత్రరంగంలో ప్రవేశించిన తమన్నా అదే సంవత్సరం టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత టాలీవుడ్‌లోని అందరు టాప్ హీరోల సరసన నటించి మిల్కీబ్యూటీగా మంచి పేరు తెచ్చుకుంది. హీరోయిన్‌గానే కాదు, స్పెషల్ సాంగ్స్ చేసేందుకు కూడా తాను రెడీ అంటోంది. ప్రస్తుతం ఆమె నటించిన `దటీజ్ మహాలక్ష్మి` విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే గోపీచంద్‌తో చేసిన `సీటీమార్` కూడా షూటింగ్ దశలో ఉంది. హిందీలో `బోలే చుడియా` చిత్రం పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. ఇక తమిళ్లో `ది నవంబర్స్ స్టోరీ` అనే వెబ్ సిరీస్ చేస్తోంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే ఇది స్ట్రీమింగ్ కానుది. ఇవన్నీ ఇలా ఉంటే.. ఇప్పుడు తమన్నా కొత్తగా ఓ షో చేయబోతోంది. దాన్ని తమన్నా టాక్ షో అని పిలిచే అవకాశం ఉంది. అందాల భామ తమన్నాతో ఒక షో చేస్తే ఎలా ఉంటుంది అనే అల్లు అరవింద్ ఆలోచన ఇప్పుడు కార్యరూపం దాల్చబోతోంది. అల్లు అరవింద్ సొంత ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన ఆహాలో ఈ షో ప్రసారం కానుంది. తమన్నా హోస్ట్‌గా వ్యవహరించే ఈ కార్యక్రమంలో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు గెస్టులుగా కనిపించబోతున్నారు.
ఈ షోకి సంబంధించి ప్రస్తుతం వినిపిస్తున్న పేర్లు రామ్‌చరణ్, అల్లు అర్జున్, రవితేజ… వీరితోపాటు ఇంకా కొంతమందిని సంప్రదిస్తున్నారని తెలుస్తోంది. సరైన సినిమాలు, ఎపిసోడ్స్ లేకపోవడం వల్ల ఆహా ఇప్పటికే వెనకబడి ఉన్న విషయం తెలిసిందే. థియేటర్స్ అందుబాటులో లేకపోవడం వల్ల ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కి డిమాండ్ బాగా పెరిగింది. ఈ క్రమంలోనే ఆడియన్స్‌ని ఆకట్టుకునే డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, షోలు చేస్తే బాగుంటుందని అల్లు అరవింద్ ఆలోచన. అందులో భాగంగానే తమన్నా టాక్ షో రూపొందుతోంది. మరి ఈ టాక్ షోతో తమన్నా ఎలాంటి పేరు తెచ్చుకుంటుంది? ఆహాను ఎక్కడి వరకు తీసుకెళ్తుంది? అనే విషయాలు తెలుసుకోవాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే!













