ఈ సమయాన్ని సద్వినియోగం : తమన్నా
నిత్యం స్వేచ్ఛగా తిరిగే ప్రజలకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ కొంత ఇబ్బంది కలిగిస్తోంది. కరోనా మహమ్మారిని దేశం నుండి పారద్రోలాలంటే ప్రజలు తమ ఇంటికే పరిమితం కావాలి. సెలబ్రిటీలు సైతం ఇదే సూచిస్తున్నారు. వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పిస్తున్నారు. మూడు వారాల పాటు లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ఈ సమయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నటి తమన్నా సూచిస్తోంది. తను కూడా మూడు వారాల పాటు ఏం చేయబోతున్నది పేర్కొన్నది. ఇంటికే పరిమితం కావాల్సిన ఈ రోజులను సద్వినియోగం చేసుకుంటాను. వాయిదా వేసిన పనులను పూర్తి చేస్తాను. నా జీవనశైలిని మరింత ఆరోగ్యకరంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను. మనం ఏదైనా ఒక అలవాటు చేసుకోవాలంటే 21 రోజుల అవసరమని అంటారు. అందుకే ఈ సమయాన్ని మంచి అలవాట్ల కోసం ఉపయోగించుకుంటాను అని పేర్కొంది.













