స్పెషల్ లుక్‌లో మిల్కీ బ్యూటీ
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. దశాబ్దానికి పైగా సౌత్ ఇండిస్ట్రీని అగ్ర కథానాయికగా ఏల్తోంది ఈ బ్యూటీ. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తెలివైన ఎంపికలతో కమ్‌బ్యాక్ అవడం ఎలాగో ఈ అమ్మడిని చూసి యంగ్ హీరోయిన్లు నేర్చుకోవాలి. ఇక కేవలం అందం, తెలివితేటలేనా? ఫ్యాషన్ యాంగిల్లోనూ మిల్కీ ఎందరికో స్ఫూర్తి. తాజాగా ఈ అమ్మడికి సంబంధించిన ఓ కొత్త లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్టైలిస్ట్ కమ్ డిజైనర్ సుకృతి గ్రోవర్ ఈ ఫోటోని షేర్ చేశారు. ఈ లుక్ చూశాక.. మిల్కీ బ్యూటీని డిజైనర్లు ఒక శిల్పంలా తీర్చిదిద్దారని ప్రశంసించి తీరాలి. వయోలెట్, బూడిద రంగు మిక్స్ చేసిన స్పెషల్ డిజైనర్ డ్రెస్‌లో మైమరపిస్తోంది తమన్నా.













