గోపీచంద్ సరసన మిల్కీబ్యూటీ ?
ఎఫ్2 సినిమాలో సక్సెస్ ట్రాక్లోకొచ్చిన తమన్నా తెలుగులో మరో సినిమాకు సైన్ చేసింది. తిరు దర్శకత్వంలో గోపిచంద్ చేస్తున్న సినిమాలో మిల్కిబ్యూటీని మీరోయిన్‌గా తీసుకున్నారు. ఈ మేరకు మరో 2 రోజుల్లో అఫీషియల్ స్టేట్మెంట్ రాబోతోంది. ఈ సినిమా ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇండో-పాక్ బోర్డర్లో ఉన్న జైసల్మేర్‌లో ఫస్ట్ షెడ్యూల్ మొదలైంది. దాదాపు 45 రోజుల పాటు ఈ షెడ్యూల్ అక్కడ కొనసాగుతుంది. అన్నీ కుదిరితే ఈ షెడ్యూల్లోనే తమన్న జాయిన్ అవుతుంది. గోపీచంద్ కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది ఈ సినిమా. ఇదొక కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్. ఏక్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనీల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.













