తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన మిల్కీ బ్యూటీ
ఇటీవల మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. తమన్నా కుటుంబం సభ్యులు కొన్నాళ్ళుగా ఆమె కోసం సంబంధాలు చూస్తుండగా, అమెరికాకి చెందిన డాక్టర్ని ఓకే చేశారని అన్నారు. పెళ్లికొడుకు ఫ్యామిలీ అమెరికాలో బాగా స్థిరపడిన కుటుంబమని, త్వరలోనే వీరిద్ధరికీ నిశ్చితార్థం జరిపి, ఆ తర్వాత పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేయాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారని వార్త సారాంశం. తన పెళ్లిపై వచ్చిన వార్తలకి తమన్నా తన ట్వీట్ ద్వారా సమాధానం ఇచ్చింది. ఒక రోజు క్రికెటర్, ఒక రోజు యాక్టర్, మరో డాక్టర్. ఈ రూమర్స్ వింటుంటే నేను నా భర్త కోసం షాపింగ్ చేస్తున్నానా అనే భావన అందరిలో కలుగుతుంది. నా వ్యక్తిగత విషయాలకి సంబంధించి ఎలాంటి ఆధారం లేకుండా వార్తలు రాస్తే అస్సలు ఒప్పకోను. నేను సింగిల్‌గా చాలా సంతోషంగా ఉన్నా. నా తల్లిదండ్రులు పెళ్లి కొడుకు కోసం వెతకడం లేదు. ప్రస్తుతం నేను నా సినిమాలతో ప్రేమలో ఉన్నా. నేను షూటింగ్ చేస్తున్న సమయంలో వచ్చి ఈ వదంతులు విని షాక్ అయ్యాను. అవి ఎక్కడి నుంచి వస్తాయో నాకు ఏమాత్రం అర్థం కావడం లేదు.
మీరు చేసే పని గౌరవప్రదంగా లేదు. నేను పెళ్లి అనే బాటలో ప్రయాణం చేయాలనుకున్నపుడు తప్పకుండా అందరికీ తెలియజేస్తాను. అప్పటి వరకు బేస్ లెస్ రూమర్స్ స్ప్రెడ్ చేయోద్దు. మరోసారి ఇదే విషయాన్ని సృష్టంగా చెబుతున్నా. నా పెళ్లి ఇప్పటి వరకు నిశ్చయం కాలేదు. ఆధారాలు లేకుండా వస్తున్న వార్తలకు ఇక నైన స్వస్తి పలకండి. ఇప్పటి వరకు వచ్చిన వార్తలు కొందరి ఊహాజనిత కథనం మాత్రమే అని తమన్నా పేర్కొన్నారు.













