పెళ్లికి సిద్ధమే కానీ ఇప్పుడు కాదు
మిల్కీ బ్యూటీగా అభిమానుల చేత కీర్తింపబడే ఆమెకు ఇటీవల దక్షిణాదిలో తీవ్ర పోటీ వచ్చింది. కొత్త హీరోయిన్లు అనేక మంది వచ్చేస్తున్నారు. దాంతో సీనియర్లకు అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. ఈ పరిణాం సహజమే. పూర్తిగా పరిశ్రమ పక్కన పెట్టకముందుగానే ఓ ఇంటిది అంటే పెళ్లి చేసుకోవాలని భావించిందట. కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో తమన్నా పెళ్లికి సంబంధించిన వార్తలు షికారు చేశాయి. వీటిని ఆమె ధృవీకరించలేదు ఖండించలేదు. తను పెళ్లిసి సిద్ధంగానే ఉన్నానని మాత్రం తెలియజేసింది. ఆ తర్వాత కూడా ముంబైలోనే స్థిరపడాలనే ఆలోచనతో ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసినట్టు తెలిసింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ అకస్మాతుగా ఆమె ఆలోచన మారిందని అంటున్నారు. పెళ్లిని మరికొద్ది రోజులు వాయిదా వేసి, ఈలోపు ఎక్కువ సినిమాలు చేయాలని భావిస్తోందట. ఎందుకంటే తమన్నా రేంజ్కి కనీసం యాభై లక్షలు పైగా పారితోషికం చెల్లిస్తారు. అందుకే వీలయినంత వరకు ఆర్థికంగా మరింత స్థిరపడ్డాకే మూడు ముళ్ళ గురించి ఆలోచిస్తుందని ఆమె సన్నిహితులు అంటున్నారు. తమన్నా ప్రస్తుతం సీటీమార్ అనే తెలుగు చిత్రం చేస్తోంది. ఇందులో మహిళా కబడ్డీ కోచ్గా నటిస్తోంది.













