ఆ విషయంలో ఇప్పటికీ మారలేదు..తమన్నా
నవతరం కథానాయికలు ఫ్యాషన్‌కి చిరునామాగా మారిపోయారు. తెరపై ఎంత కొత్తగా కనిపించాం, ట్రెండ్‌కి ఎంత దగ్గరగా ఉన్నామనే విషయంపై మరింత దృష్టి పెడుతున్నారు. ఫ్యాషన్ పరంగా ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది తమన్నా. హిందీ పరిశ్రమకి వెళ్లాకే ఫ్యాషన్ గురించి మరింత తెలుసుకున్నాననీ, అయితే ఫ్యాషన్ పరంగా చాలా సవాళ్లే ఎదురవుతుంటాయని చెబుతోంది. ట్రెండ్‌కు తగ్గ దుస్తుల్ని ఎంచుకోవడమే ఫ్యాషన్ కాదు. ఆ దుస్తులు మనకు నప్పేలా ఉండాలి. కొన్నిసార్లు దుస్తుల కోసం శారీరకంగా మారాల్సి వస్తుంది కూడా. అలా చాలాసార్లు నేను ఆహార నియమాల్ని పాటించి నాజూగ్గా మారాను. అలా చేస్తేనే ఆ దుస్తుల్లో ఆత్మవిశ్వాసంతో కనిపించగలుగుతాం అంది తమన్నా. నాయికగా ఎప్పటికప్పుడు తన ప్రణాళికలు మార్చుకుంటుంటాను కానీ, ముద్దు విషయంలో ఇప్పటికే మారలేదని చెబుతోందామో. చిన్న వయసులోనే చిత్ర పరిశ్రమకు వచ్చా. ముద్దు సన్నివేశాలకి దూరంగా ఉండాలనుకొన్నా. ఆ నిబంధన ఇప్పటికీ పాటిస్తున్నానని చెప్పింది తమన్నా.













