జయప్రద పాత్రకు తమన్నా గ్రీన్ సిగ్నల్
ఎన్టీఆర్ బయోపిక్ మూవీపై ప్రేక్షకులు, అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. బాలకృష్ణ, క్రిష్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాలోని ప్రధాన పాత్రలను పలువురు ప్రముఖ నటీనటులు పోషిస్తున్నారు. చంద్రబాబు నాయుడు పాత్రలో రానా, ఏఎన్నార్ పాత్రలో సుమంత్, శ్రీదేవి పాత్రలో రకుల్‌ప్రీత్ సింగ్, హరికృష్ణ పాత్రలో కల్యాణ్ రామ్ నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఆ చిత్రంలో జయపద్ర పాత్రను అయిదు నిమిషాల పాటు చూపిస్తారట. జయపద్ర పాత్ర కోసం తమన్నాతో క్రిష్ సంప్రదింపులు జరిపాడని తెలిసింది. తన సినీ కెరీర్లో ఎన్టీఆర్‌తో జయపద్ర ఎన్నో చిత్రాల్లో నటించింది. ఈ పాత్ర కోసం తమన్నా అయితే బాగుంటుందని క్రిష్, బాలకృష్ణలు భావించారు. అయితే జయప్రద పాత్రలో నటించడానికి తమన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇక ఎన్టీఆర్ బయోపిక్ రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.













