తమన్నా కొత్త జర్నీ
నటిగా 15 ఏళ్లుగా కొనసాగుతున్నారు తమన్నా. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రకరకాల పాత్రలు చేశారు. కొన్నిసార్లు స్పెషల్ సాంగ్స్ చేశారు. ఇప్పుడు నటిగా ఓ కొత్త జర్నీ ఆరంభించారని తెలిసింది. ఓ వెబ్ సిరీస్లో నటిస్తూ డిజిటల్ ప్లాట్ఫామ్లోకి తమన్నా ఎంట్రీ ఇస్తున్నారని సమాచారం. వికడన్ టెలీవిస్తాస్ నిర్మిస్తున్న ఓ వెబ్ సిరీస్లో లీడ్ రోల్ చేస్తున్నారు తమన్నా. ఈ వెబ్ సిరీస్లో హాట్స్టార్లో ప్రసారం కానుంది. ఈ సిరిస్ ఏ జానర్లో ఉండబోతోంది? ఎవరు దర్శకత్వం వహిస్తున్నారనే సమాచారం బయటకు రాలేదు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ షూటింగ్ స్టేజ్లో ఉంది. ఇది కాకుండా హిందీలో బోల్ చుడి యా చిత్రీకరణలో పాల్గొంటున్నారు తమన్నా. తమిళంలో ఓ సినిమా కూడా కమిట్ అయ్యారు.













