చైతూతో మిల్కీబ్యూటీ సయ్యాట!
మిల్కీబ్యూటీ తమన్నాకు ఐటెంసాంగ్లు కొత్తేమి కాదు. గతలో అల్లుడు శ్రీను, స్పీడున్నోడు, జైలవకుశ వంటి చిత్రాల్లో ప్రత్యేకగీతాల్లో నటించింది సుందరి. తాజాగా ఈ భామ మరో ఐటెంపాటకు ఓకే చెప్పింది. వివరాల్లోకి వెళితే, నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సవ్యసాచి. చందు మొండేటి దర్శకుడు. మైత్రీమూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఈ సినిమాలో నాగార్జున నటించిన అల్లరి అల్లుడు చిత్రంలోని నిన్ను రోడ్డుమీద చూసినాది అనే పాపులర్ పాటను రీమేక్ చేయబోతున్నారు. ఈ పాటలో చైతూ సరసన ఓ అగ్రనాయిక నటిస్తుందని చిత్ర బృందం ఇదివరకే పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా తమన్నాను ఈ అవకాశం వరించినట్లు సమచారం. గతంలో నాగచైతన్యతో కలిసి 100పర్సంట్ లవ్, తడాఖా చిత్రాల్లో నటించింది తమన్నా. ఆమె ముచ్చటగా మూడోసారి చైతూతో జోడీకట్టబోతుండటం విశేషం.













