మహేష్‌తో మిల్కీబ్యూటీ స్టెప్పులు ?
మహేష్ బాబుకు ఆగడు చిత్రంలో జోడీ కట్టిన ఈ భామ ఇప్పుడు మహేష్ ఇంట్రడక్షన్ సాంగ్‌లో స్టెప్పులు వేయబోతున్నట్లు పరిశ్రమలో వినిపిస్తోంది. మహేష్‌బాబు, రష్మిక మండన్న నాయకానాయికలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సరిలేరు నీకెవ్వరు చిత్రం నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో ప్రత్యేక పాటలో కాకుండా మహేష్ ఇంట్రడక్షన్ సాంగ్‌లో తమన్నా సందడి చేయబోతోందని అంటున్నారు. పాత్ర రీత్యా మహేష్ ఇంట్రడక్షన్ సాంగ్‌కు ఇందులో ఎంతో ప్రాధాన్యం ఉందట. అందుకే ఈ పాటకు అన్ని హంగులు అద్ది మరీ చిత్రీకరించనున్నారట. ప్రస్తుతం ఆమె నటించిన, నటిస్తున్న చిత్రాలు వివిధ దశలలో ఉన్నాయి. వాటిలో సైరా నరసింహారెడ్డి, దటీజ్ మహాలక్ష్మీ తెలుగు చిత్రాలతో పాటు తమిళంలో పెట్రోమాక్స్, యాక్షన్, బాలీవుడ్లో బోలే చుడియాన్ చిత్రాలున్నాయి. వాటికి అదనంగా సరిలేరు నీకెవ్వరు ఇంట్రడక్షన్ సాంగ్‌లో అవకాశం ఆమె ఖాతాలోకి చేరింది.













