సైరా లో మిల్కీబ్యూటీ?
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి. నయనతార కథానాయిక. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. ఇందులో బిగ్ బి అమితాబ్, జగపతిబాబు, విజయ్‌సేతుపతి, సుదీప్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో సైరా బృందంతో మరో స్టార్ హీరోయిన్ కూడా కలవనున్నారు. ఇందులో ఓ ముఖ్య పాత్రకు మిల్కీబ్యూటీ తమన్నాను తీసుకున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. విజయ్ సేతుపతికి జోడీగా ఇందులో ఆమె కనిపించనున్నారట. తమన్నా పాత్ర గురించి ఇప్పటికే ఆమెకు వివరించగా, ఆమె కూడా పచ్చజెండా ఊపారని సమచారం.













