ఐపిఎల్ వేడుకలో మిల్కీబ్యూటీ
ఐపిఎల్‌కు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా క్రేజ్ ఉంది. 51 రోజుల పాటు సాగే ఈ క్రీడా సంబరాల ఆరంభవేడుకలు అదిరిపోయేలా ఉంటాయి. తొలిరోజు వేడుకల ఏర్పాట్లు ఎప్పటిలాగే భారీఎత్తున జరుగుతున్నాయి. మిల్కీబ్యూటీ తమన్నా ఐపిఎల్ ఆరంభ వేడుకల్లో చిందేస్తుండం విశేషం. గతంలో కత్రినాకైఫ్, అమీజాక్సన్, హృతిక్ రోషన్, షాహిద్పూర్, యామీగౌతమ్ వంటి బాలీవుడ్ స్టార్లు కనువిందు చేశారు. ఈ సారి కూడా హృతిక్ రోషన్, వరుణ్ధావస్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, పరిణితీచోప్రా వంటి స్టార్లు లైవ్డ్యాన్స్ ఫెర్పామెన్స్ చేయబోతున్నారు. వీరితో పాటు సౌత్‌స్టార్ తమన్నా భాటియా కూడా చిందేస్తుండటం ఓ రకంగా విశేషమే. ప్రభుదేవా, మికాసింగ్ కూడా లైవ్ డ్యాన్స్ ప్రదర్శనలు ఇవ్వబోతున్నారు. ఈ నెల 7న ఐపిఎల్ కొత్త సీజన్ ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే.













