మెగాస్టార్ తో తమన్నా ?
మెగా కథానాయకులకు అచ్చొచ్చిన నాయిక తమన్నా. పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రామ్‌చరణ్‌లతో కలసి నటించింది. ఇప్పుడు చిరంజీవితో సైరాలో కలసి నటిస్తోంది. చిరు 152 చిత్రంలోనూ కథానాయికగా తమన్నానే ఎంచుకున్నట్టు సమచారం. చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో కథానాయికగా తమన్నాని ఎంచుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సైరా తో బిజీగా ఉన్నారు చిరు. 2019 వేసవిలో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఈలోగానే కొరటాల చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సామాజిక ఇతివృత్తంలో కమర్షియల్ చిత్రాల్ని తెరకెక్కించడం కొరటాల శివ ప్రత్యేకత. ఈసారీ అలాంటి కథనే ఎంచుకున్నట్టు తెలుస్తోంది.













