పెళ్లి చేసుకుంటా.. వరుడిని చూడండి
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం దటీజ్ మహాలక్ష్మీ, ఖామోషీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇక ప్రభుదేవాతో ఆమె కలిసి నటించిన అభినేత్రి 2 చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2016లో వచ్చిన అభినేత్రి కి సీక్వెల్ ఇది. అయితే తమన్నాను ఈ మధ్య పెళ్లెప్పుడు చేసుకోవాలనుకుంటున్నారు? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. గతంలో తమన్నా కూడా ఏదో ఒకటి చెప్పి మాట దాటేస్తూ వచ్చారు. అయితే తాజాగా తమన్నా మాట్లాడుతూ సరైన వ్యక్తి దొరికితే ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు మంచి అబ్బాయిని వెతికిపెట్టమని అభినేత్రి 2 దర్శకుడు ఏ.ఎల్ విజయ్ కూడా అడిగాను అని పేర్కొనడం విశేషం.













