పెళ్లికి సిద్ధమైన మిల్కీబ్యూటీ!
మూడుపదులు దాటిన హీరోయిన్లందరూ పెళ్లి చేసుకుని స్థిరపడడానికి రెడీ అయిపోతున్నారు. వీరి బాటలోనే మిల్కీబ్యూటీ తమన్నా కూడా పెళ్లికి సిద్ధమైపోతోందట. తమన్నా కోసం వరుడు కూడా రెడీగా ఉన్నాడని అంటున్నారు. అతడు అమెరికాలో డాక్టర్ అని తెలుస్తోంది. పెళ్లికొడుకు ఫ్యామిలీ అమెరికాలో బాగా సిర్థపడిన కుటుంబమని సమాచారం. అక్కడ వారికి చాలా వ్యాపారాలున్నాయని తెలుస్తోంది. ఇరువైపులా పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చి నిశ్చితార్ధానికి ముహూర్తాలు చూస్తున్నారని సమాచారం. పెళ్ళి తరువాత తమన్నా అమెరికా వెళ్ళిపోతుందని అంటున్నారు. పెళ్లి కోసమే తమన్నా పెద్దగా సినిమాలు ఒప్పుకోవడంలేదని టాక్.













