చేతినిండా ప్రాజెక్టులతో ఎవరికీ అందని ఎత్తులో సంగీత దర్శకుడు తమన్
తమన్ ప్రస్తుతం సంగీత ప్రపంచంలో మారు మోగుతున్న పేరు. ‘సామజవరగమనా’, ‘బుట్టబొమ్మా’, ‘రాములో రాములా’ అంటూ అటు క్లాస్, ఇటు మాస్ ప్రేక్షకుల్ని గతేడాది తన సంగీతంతో అలరించారు సంగీత దర్శకుడు తమన్. ‘అల.. వైకుంఠపురములో..’, ‘వకీల్‌సాబ్’ పాటలతో మాంచి విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలోనే సంగీత దర్శకుడిగా ఆయనకు వరుస సినిమా అవకాశాలు అందిపుచ్చుకున్నారు. దీంతో ఆయన ఈ ఏడాది మొత్తం రికార్డింగ్స్‌తో పూర్తి బిజీగా మారనున్నారు. ఒకటి కాదు రెండు కాదు మొత్తం పది ప్రాజెక్ట్‌లు ప్రస్తుతానికి తమన్ చేతిలో ఉన్నాయి.
తెలుగుతో పాటు ప్రస్తుతం తమిళం, కన్నడ, మలయాళం.. ఇలా వివిధ భాషల్లో అతను సినిమాలు చేస్తున్నాడు.ఇంత బిజీ టైంలో కూడా ప్రతి సినిమాకూ మంచి ఔట్ పుట్ ఇస్తున్నారు. తాజాగా కన్నడలో విడుదలైన ‘యువరత్న’కు తమన్ పాటలు, నేపథ్య సంగీతం పెద్ద ప్లస్ అయ్యాయి. తెలుగులో వచ్చిన ‘వైల్డ్ డాగ్’లోనూ తమన్ నేపథ్య సంగీతానికి ప్రశంసలు దక్కుతున్నాయి .పవన్‌కల్యాణ్-రానా నటిస్తున్న‘అయ్యప్పనుమ్ కోషియం’ రీమేక్, సూపర్ స్టార్ మహేష్ బాబు తదుపరి చిత్రం ‘సర్కారువారి పాట’కు, నందమూరి బాలకృష్ణ -బోయపాటి కాంబోలో వస్తున్న మూడో చిత్రంతోపాటు ప్రాజెక్ట్‌లతో పాటు వరుణ్‌తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న కొత్తచిత్రం(VT10), నాని ‘టక్ జగదీశ్’, శింబు ‘ఈశ్వరన్’ (తమిళ ప్రాజెక్ట్), పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కదువ’ (మలయాళీ ప్రాజెక్ట్) సినిమాలకు తమన్ స్వరాలు అందించనున్నారు.
తమన్ సంగీత దర్శకుడిగా ఇంత పేరు సంపాదించడం అంతా ఆషామాషీగా జరగలేదు. 13 యేళ్లు చిన్న వయసులో నాన్నను పోగట్టుకున్న తమన్.. ఆ తర్వాత చదవుకు స్వస్తి చెప్పి.. తనకు ఇష్టమైన సంగీత రంగాన్ని ఎంచుకున్నాడు. లేేలేత వయసులోనే డ్రమ్మర్‌గా జీవితాన్ని ప్రారంభించి ఒక్కో మెట్టు పైకెక్కుతూ మ్యూజిక్ డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఏస్ డైరెక్టర్ శంకర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో.. దిల్ రాజు ప్రొడక్షన్లో వస్తోన్న ప్రతిస్త్రాత్మకమైన సినిమాలో కూడా టాలీవుడ్ మ్యూజిక్ తరంగం ఎస్ ఎస్ తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ అయ్యాడని తెలుస్తుంది. ఇందులో ఎంతవరకు నిజముందనేది అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచిచూడాల్సిందే.













