అప్పుడే చరణ్17 గురించి వార్తలు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా రిలీజ్ డేట్ గురించి ఇంకా ఓ క్లారిటీ అనేది రాలేదు. మరోవైపు బుచ్చి బాబు దర్శకత్వంలో తన 16వ సినిమాను అనౌన్స్ చేశాడు చరణ్. ఆ సినిమా ఎప్పటి నుంచి సెట్స్ పైకి వెళ్తుందనేది ఇంకా తెలీదు. ఇలాంటి టైమ్ లో చరణ్, తన 17వ సినిమాను సుకుమార్ తో చేయనున్నాడని వార్తలొస్తున్నాయి.
రంగస్థలం తర్వాత మరోసారి తమ కాంబోని రిపీట్ చేయాలనుకున్నారు కానీ పుష్ప వల్ల అది సాధ్యం కాలేదు. సుకుమార్ దగ్గర చరణ్ కోసం ఓ స్టోరీ కూడా ఉంది కానీ అది ఫుల్ స్క్రిప్ట్ రూపంలోకి రావడానికి బాగానే టైమ్ పడుతుంది. గేమ్ ఛేంజర్ ను సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత బుచ్చిబాబు సినిమా కోసం కనీసం ఓ ఏడాదైనా పడుతుంది.
ఆ తర్వాత చరణ్ తన 17వ సినిమా చేయనున్నాడు. అంటే ఎంత లేదన్నా మరో ఏడాదిన్నర టైమ్ పడుతుంది. ఈ లోగా పుష్ప2 రిలీజ్ కూడా పూర్తి చేసుకుని సుకుమార్ ఫ్రీ అయిపోతాడు. చరణ్ ఖాళీ అయ్యే రోజుకు సుకుమార్ స్టోరీని రెడీ చేసేయొచ్చు. కానీ సుకుమార్ పుష్ప3 ఆలోచనలో ఉన్నాడనే టాక్ కూడా వినిపిస్తోంది. బన్నీ కూడా దీనిపై ఇంట్రెస్టింగ్గానే ఉన్నట్లు తెలుస్తోంది. మరి సుకుమార్ తన తర్వాతి సినిమా ను చరణ్ తో చేస్తాడా లేక పుష్ప3 చేస్తాడా అన్నది తెలియాల్సి ఉంది.













