టాలెంట్ ని మాత్రమే చూసే సుకుమార్
ఓ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ గా చేరడమంటే చాలా ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులోనూ స్టార్ డైరెక్టర్ దగ్గర అయితే ఇక చెప్పాల్సిన పని లేదు. ఎన్నో సిఫార్సులు, ఎంతో ఎక్స్పీరియన్స్ అవసరం. కానీ గతంతో కంటే ఇప్పుడు చాలా బెటర్. టాలెంట్ ఉన్న వాళ్లని డైరెక్టర్లు ఎంకరేజ్ చేస్తున్నారు. కొత్తగా ఆలోచింగలిగే వారుంటే వారిని డైరెక్టర్లు వెంటనే అసిసెంట్లుగా తీసుకుంటున్నారు.
ఏదోలా వారి టాలెంట్ ని వాడుకోవాలని చూస్తున్నారు. ఈ విషయంలో సుకుమార్ చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నారు. తన దగ్గర అసిస్టెంట్ గా చేరాలంటే టాలెంట్ ఒక్కటి ఉంటే చాలట. నేర్చుకోవాలనే తపన, కష్టపడే మనస్తత్వం ఉంటే ఆయన ఎవరికైనా ఛాన్స్ ఇస్తారని ఆయన దగ్గర పనిచేసిన చాలా మంది చెప్తున్నారు. టాలెంట్ ఉన్న వారిని ఎంకరేజ్ చేయడంలో సుకుమార్ ఎప్పుడూ ముందుంటారని ఆయన శిష్యులు చెప్తున్నారు.
మొదటి మీటింగ్‌లోనే సుకుమార్ తన దగ్గరకు వచ్చిన వారి బేసిక్ వివరాలు అడిగి తెలుసుకుని, పనికొస్తాడా లేదా అనే అంచనాకి వచ్చేస్తాడట. పనికొస్తాడని అనుకున్న వాళ్లని వెంటనే వర్క్ లోకి వచ్చేయ్ అని చెప్పేస్తాడట. అందుకే సుకుమార్ దగ్గర ఎప్పుడూ ఓ పది పదిహేనుమంది పని చేస్తూంటారు. ఎలాంటి పాలిటిక్స్ లేకుండా, ఎవరి ఐడియాలను వారు ఆయనతో పంచుకోవడానికి కావాల్సినంత స్వేచ్ఛను సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్లకు ఇస్తాడట. ఏదైనా తను ఎదుగుతూ మరో నలుగురిని తనతో పాటూ పైకి తీసుకురావాలనే సుకుమార్ శైలిని అందరూ మెచ్చుకోవాల్సిందే!













