మార్షల్ టీజర్ విడుదల చేసిన తలసాని
శ్రీకాంత్, మేఘా చౌదరి, అభయ్ కీలక పాత్రధారులుగా జై రాజా సింఘ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం మార్షల్. అభయ్ అడక నిర్మాత ఈ చిత్రం టీజర్‌ను తలసాని శ్రీనివాస్ యాదవ్ రామానాయుడు స్టూడియోలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పరిశ్రమకు కొత్తవారు వస్తేనే కొత్త కథలు తయారవుతాయి. న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయాలి. ఒక సినిమా అనుభవంతో గౌతమ్ తిన్ననూరి తీసిన జెర్సీ అద్భుతంగా ఉంది. కొత్త దర్శక నిర్మాతలు తీసిన మార్షల్ సినిమా హిట్ కావాలి అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ మనిషి ఇంత ఈజీగా బతుకుతున్నాడంటే దానికి కారణం ఒక సైంటిస్ట్. దాని నుంచి వచ్చిన కథే ఇది అని చెప్పారు. ఈ కథ స్పాన్ చూసి బలమైన కథను కొత్త వాళ్ళు ఎంత వరకూ న్యాయం చేయగలరనిపించింది. నిర్మాత ఇచ్చిన భరోసాతో అంగీకరించా అని శ్రీకాంత్ తెలిపారు.













