అమర గాయకుడికి అశ్రు నివాళి
ప్రముఖ నేపథ్య గాయకుడు, ఐదున్నర దశాబ్ధాలుగా తమ గానామృతంతో మందందిరినీ అలరింపజేసిన శ్రీ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు అనారోగ్య కారణాలతో పరమపదించడం భారతీయలందరితో పాటు ప్రపంచ వ్యాప్తంగా సంగీతాభిమానులందరినీ దిగ్బ్రాంతికి గురిచేసింది. సుమధుర గాయకుడుగా, వ్యాఖ్యాతగా, సంగీత దర్శకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నిర్మాతగా , నటుడిగా వెలకట్టలేని ఆయన సేవలు అపురూపం, అనిర్వచనీయం.
భారత దేశమంతా ఆయన ఖ్యాతి మరువలేనిది, మరపురానిది .. మరీ ముఖ్యంగా గత 50 సంవత్సరాలుగా దక్షిణ భారత రాష్ట్రాల్లో ఆయన స్వరం వినపడని గడప ఏ ఒక్కటీ ఉండదంటే అతిశయోక్తి కాదు. ఇటువంటి మహోన్నత శిఖరంతో టాకో అవినాభావ సంబంధం కలిగివుండడం మనందరి అదృష్టం. 1997 లో టాకో కోసం వారు నిర్విహించిన ప్రత్యేక సంగీత కార్యక్రం మరియు 2014 లో టాకో సౌజన్యం తో నిర్వహించబడిన పాడుతా తీయగా కార్యక్రం కొలంబస్ తెలుగు ప్రజల గుండెల్లో మరుపురాని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయనడంలో సందేహం లేదు.
మనందరం ముద్దుగా పిలుచుకునే బాలు మనకి భౌతికంగా దూరమైనా, ఆయన వెదజల్లిన అమర గానామృతం మనల్ని ఎప్పుడూ అలరిస్తూనే ఉంటుందని ఆశిస్తూ .. తెలుగు ప్రజలందరి తరపునా మరియు సంగీతాభిమానులందరి తరపునా వారి ఆత్మకు శాంతి కలగాలని టాకో EC కమిటి భగవంతుణ్ణి ప్రార్థిస్తోంది
జగన్నాథ్ చలసాని ప్రెసిడెంట్













