అందుకే ఆ సినిమాకు తాప్సీ గుడ్ బై
తాప్సీ ప్రస్తుతం బాలీవుడ్లో బిజీ యాక్టర్. పింక్ సినిమా ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. కమర్షియల్ సినిమాలతోపాటు పాత్రకు ప్రాధాన్యత కలిగిన చిత్రాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్గా రాణించే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఆమె ఓ ప్రాజెక్టు నుంచి తపుప్పకుంది. బర్ఫీ ఫేమ్ అనురాగ్ బసు లైప్ ఇన్ ఏ మెట్రోకి సీక్వెల్‌ని తెరక్కెంచే పనిలో ఉన్నారు. రాజ్‌కుమార్ రావు, ఫాతిమా సనా షేక్, ఆదిత్య రాయ్ కపూర్, అభిషేక్ బచ్చన్ ముఖ్య పాత్రధారులుగా ఎంపికయ్యారు. వీరితో పాటు ఆదిత్యరాయ్ కపూర్ సరసన తాప్సీని హీరోయిన్గా ఎంపిక చేశారు. అయితే ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించిగాని, తన కాల్షీట్ల విషయంలోగానీ దర్శకుడు క్లారిటీ ఇవ్వడం లేదట. దీంతో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుందని తెలుస్తుంది.













