Taapsee Pannu: డిజైనర్ వేర్ లో తాప్సీ అందాల ఆరబోత
విదేశీ ప్రియుడు మాథియాస్ బోని(mathews Boni)ని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా తాప్సీ పన్ను(Taapsee Pannu) ఏ మాత్రం మారలేదు. ఇంతకు ముందు ఎంత యాక్టివ్ గా ఉండేదో ఇప్పుడు కూడా అలానే కనిపిస్తూ నటిగా, నిర్మాతగా కెరీర్లో దూసుకెళ్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తాప్సీ రెగ్యులర్ గా తన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు టచ్ లోనే ఉంటుంది. తాజాగా అమ్మడు కాఫీ కలర్ డిజైనర్ వేర్ లో ఎంతో స్లిమ్ గా కనిపించడంతో పాటూ చాలా కొత్తగా కనిపించింది. ఈ ఫోటోల్లో తాప్సీ ఇంతకుముందు కంటే హాట్‌గా కనిపిస్తుందని నెటిజన్లు తాప్సీ ఫోటోలకు కామెంట్స్ చేస్తున్నారు.






