జన్మదిన కానుక సైరా టీజర్ రిలీజ్
ఆగస్టు 22కి గల ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా గల మెగాభిమానులంతా వేడుకగా జరుపుకునే రోజది. అందుకే ఆ రోజు సైరా సినిమా టీజర్ రిలీజ్ చేయడానికి మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. కారణాలు ఇదమిద్దంగా బయటకు రాకున్నప్పటికీ సైరా సినిమా షూటింగ్ పదే పదే అవాంతరాలు ఎదుర్కొంటుండడం మెగాభిమానులకు నిరాశను కలిగిస్తోంది. అందుకే వాళ్ల నిరాశను పారద్రోలి, సినిమాకు హైప్ తీసుకురావడానికి టీజర్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చిరంజీవి సరసన నయనతార నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ సహా పలువురు టాప్ యాక్టర్స్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రామ్‌చరణ్ స్వయంగా నిర్మిస్తున్నారు. వచ్చే సమ్మర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.













