18న సైరా ట్రైలర్ విడుదల
చిరంజీవి కథానాయకుడిగా నటించిన చిత్రం సైరా నరసింహారెడ్డి. సురేందర్‌రెడ్డి దర్శకుడు. అక్టోబరు 2న విడుదల అవుతోంది. ఈనెల 18న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో సైరా ట్రైలర్‌ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో పాటు సినీ ప్రముఖులు పవన్ కల్యాణ్, ఎస్.ఎస్.రాజమౌళి, వి.వి.వినాయక్, కొరటాల శివ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. రామ్‌చరణ్ నిర్మించి ఈ చిత్రంలో అమితాబ్‌బచ్చన్ ఓ కీలక పాత్ర పోషించారు. నయనతార, తమన్నా, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం విడుదల కానుంది.













