జార్జియాలో సైరా యుద్ధం
యుద్ధం ఎవరిది? స్వాతంత్య్రం కోసం పోరాటం చేస్తున్న ప్రతి భారతీయుడిది. చెప్పాలంటే స్వాతంత్య్ర కోసం తెలుగు ప్రజలను ముందుండి నడిపిస్తున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డిది. ఆయన పిలుపు కోసం పోరాటానికి వచ్చిన ప్రజలది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా రూపొందుతోన్న చిత్రం సైరా నరసింహారెడ్డి. చిరంజీవి హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం జార్జియాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారీ క్లైమాక్స్ వార్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నట్టు సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తెలిపారు. యుద్ధ సన్నివేశాల చిత్రీకరణకు సైరా చిత్ర బృందమంతా సన్నద్ధమైందని ఆయన తెలిపారు.













