అక్టోబరు 20 నుంచి మెగాస్టార్ సైరా షూటింగ్
మెగాస్టార్ చిరంజీవి తన 151వ సినిమాగా సైరా నరసింహరెడ్డి చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ ను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌కు మూహుర్తం నిర్ణయించారు. అక్టోబర్ 20 నుండి రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుకానుంది. హైదరాబాద్‌లోని నానక్ రామ్ గూడా స్టూడియోస్‌లో ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ వేసిన ప్రత్యేక సెట్లో తొలి షెడ్యూల్ షూటింగ్ జరగనుంది. ఈ షెడ్యూల్ పూర్తి అయిన తర్వాత చిత్ర యూనిట్ పొలాచిలో షూటింగ్‌కు వెళ్లనుంది. ఈ తర్వాత రాజస్థాన్ మరో షెడ్యూల్ జరపాలని నిర్ణయించారు. ఈ మూవీలో అమితాబచ్చన్ కీలకపాత్రలో కనిపించనున్నాడు. హీరోయిన్గా నయనతార ఎంపికైంది. ఇక జగపతిబాబు, విజయ్ సే తుపతి, సునీల్ తదితరులు నటిస్తున్నారు. రామ్ చరణ్ తేజ్ ఈ మూవీకి నిర్మాత.













