ఎన్టీఆర్-తమన్నా స్పెషల్ ‘స్వింగ్ జర’ పాట విడుదల
నాలుగు పాటలు విడుదల చేసిన జై లవకుశ టీం మరో పాట చాలా ఇంప్రెసివ్‌గా ఉంటుందని, ఆ సాంగ్‌ని కొద్ది రోజులలో విడుదల చేస్తామని హోల్డ్‌లో పెట్టారు. ‘స్వింగ్ జర’ అంటూ సాగే ఈ పాటని కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. ఈ ప్రత్యేక గీతంలో తమన్నా గ్లామర్, ఎన్టీఆర్ స్టెప్పులు ఆడియన్స్ మతులు పోగొడుతుంది. కొరియోగ్రఫీ దగ్గర్నుంచి మ్యూజిక్ వరకు అన్నింటిలోనూ కొత్తదనం ఉండే సరికి ఈ పాట అందరిని అలరిస్తుంది.
ఎన్టీఆర్, రాశీ ఖన్నా, నివేదా థామస్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్‌పై కళ్యాణ్ రామ్ ఈ సినిమాని నిర్మించాడు. సెప్టెంబరు 21న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన లభించింది.













