తమ బంధాన్ని బయటపెట్టిన స్వాతి
సాయి ధరమ్ తేజ్, కలర్స్ స్వాతి ఈ రెండు పేర్లు కలిపి చెప్తే ఇప్పటివరకు వీరిద్దరికీ అసలేం సంబంధం లేదు కదా అనుకునేవాళ్లు. వీరిద్దరూ కలిసి సినిమాల్లో నటించిందీ లేదు. రీసెంట్‌గానే వీరిద్దరూ కలిసి సత్య అనే షార్ట్ ఫిల్మ్ చేశారు. అయితే వీరిద్దరి గురించి ఆడియన్స్ కు తెలియన ఓ కొత్త విషయాన్ని వాళ్లు రివీల్ చేశారు.
సాయి తేజ్, స్వాతి ఇద్దరూ కలిసి ఒకే కాలేజీలో చదువుకున్నారట. అంతేకాదు వాళ్లిద్దరూ క్లాస్ మేట్స్ అట. చదువుకునే రోజుల నుంచి ఇద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని వెల్లడించారు. స్వాతి నటిస్తున్న మంత్ ఆఫ్ మధు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కు గెస్టుగా వచ్చిన తేజూతో స్వాతి క్లోజ్ గా మూవ్ అవుతుంటే అందరూ వింతగా చూశారు.
కానీ స్వాతి అసలు విషయం చెప్పాక వాళ్లిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అని తెలిసింది. అంతేకాదు తేజుని రేయ్ అని కూడా అంటుందంటే వారి మధ్య బంధాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇద్దరూ కలిసి డిగ్రీ చదివినట్లూ, తేజు తన పేపర్లోనే చూసి కాపీ కొట్టేవాడని స్వాతి చెప్తుంటే, అసలు ఎగ్జామ్స్ లో చూపించేదే కాదని తేజూ స్వాతిపై కంప్లైంట్ చేశాడు. తేజూ తనకు లైఫ్ లో చాలా ఇంప్టార్టెంట్ ఫ్రెండ్ అని, అన్ని విషయాల్లో తనకెంతో సపోర్ట్ ఇస్తాడని స్వాతి చెప్పుకొంది.













