Swasika: తమ్ముడు కోసం స్మోకింగ్ నేర్చుకున్నా
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithin), వేణు శ్రీరామ్(Venu Sriram) కలిసి చేసిన సినిమా తమ్ముడు(Thammudu). దిల్ రాజు(Dil Raju) నిర్మించిన ఈ సినిమాలో లయ(Laya) నితిన్ కు అక్కగా నటిస్తున్నారు. పెళ్లి చేసుకుని ఎప్పుడో ఇండస్ట్రీకి దూరమైన లయ, మళ్లీ ఇప్పుడు ఈ సినిమాతో రీఎంట్రీకి రెడీ అయ్యారు. తమ్ముడు సినిమాలో వర్ష బొల్లమ్మ(Varsha Bollamma), సప్తమి గౌడ(Saptami Gowda), స్వసిక విజయ్(Swasika Vijay) కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమా కోసం ముగ్గురు హీరోయిన్లూ కొత్తగా ఓ స్పెషల్ టాలెంట్ ను నేర్చుకున్నట్టు ప్రమోషన్స్ లో తెలిపారు. ఈ మూవీ కోసం వర్ష బొల్లమ్మ కిక్ బాక్సింగ్ నేర్చుకోగా, సప్తమి గౌడ తమ్ముడు సినిమా కోసం హార్స్ రైడింగ్ నేర్చుకున్నారు. వీరిద్దరూ కాకుండా మరో కీలక పాత్రలో నటించిన స్వసిక విజయ్ ఈ సినిమా కోసం ఏకంగా స్మోకింగ్ ఎలా చేయాలో నేర్చుకున్నారట.
తమ్ముడు మూవీలోని తన క్యారెక్టర్ కోసం రెడీ అవుతున్నప్పుడు డైరెక్టర్ తనకు సిగార్ ప్యాకెట్ ఇచ్చి స్మోకింగ్ నేర్చుకోవాలని చెప్పినట్టు ఆమె ఓ ఇంటర్య్వూలో తెలిపారు. దాని కోసం ఆమె ప్రతీ రోజూ ఉదయం, సాయంత్రం ప్రాక్టీస్ చేశానని, ఆఖరికి తన తల్లి ముందు కూడా తాను స్మోక్ చేయాల్సి వచ్చిందని, అయితే అదంతా తన జాబ్ లో భాగమని తల్లికి నచ్చ చెప్పానని, సినిమా మొత్తంలో ఒక ఐదు సీన్స్ తప్పించి మిగిలిన ప్రతీ సన్నివేశంలోనూ తాను స్మోక్ చేస్తూనే కనిపిస్తానని, సినిమాలో మీరు చూసేది నిజమైన సిగార్లేనని, వాటి వాసనకు తనకు వాంతులు, తలనొప్పి కూడా వచ్చాయని స్వసిక్ తెలిపారు.







