Susmitha: మెగా డాటర్ కల నెరవేరిన వేళ
తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)ని హీరోగా పెట్టి తాను నిర్మాతగా సినిమా చేయాలని సుస్మిత కొణిదెల(Sushmitha Konidela) ఎంతో కాలంగా ట్రై చేస్తోంది. దాని కోసం బీవీఎస్ రవి(BVS Ravi) రైటర్ గా ఓ కథను రెడీ కూడా చేయించింది. డైరెక్టర్ కోసం ఎంతో కాలంగా వెతుకుతున్నారు. కానీ సదరు డైరెక్టర్లు చెప్తున్న స్క్రీన్ ప్లే చిరూకి నచ్చకపోవడంతో తండ్రితో సినిమా చేయాలనే మెగా డాటర్ కోరిక ఇప్పటివరకు నెరవేరలేదు.
ఆ మధ్య సొంత ప్రొడక్షన్ లో చేయడం ఇష్టం లేకే చిరూ కావాలని కూతురి మూవీని లేట్ చేస్తున్నారని కూడా వార్తలొచ్చాయి. సరిగ్గా అలాంటి టైమ్ లో అనిల్ రావిపూడి(Anil Ravipudi)తో సినిమా సెట్ అవడం, తన కూతురి కోరికను చిరూ(Chiru), నిర్మాత సాహు గారపాటి(Sahu Garapati)కి చెప్పి ఒప్పించడం అన్నీ వెంటవెంటనే అయిపోయాయి. మొత్తానికి ఇవాళ అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా మెగా157(Mega157) మూవీ స్టార్ట్ అయింది.
ఈ సినిమాకు షైన్ స్క్రీన్స్(Shine Screen Entertainments) బ్యానర్ లో సాహు గారపాటి నిర్మాతగా వ్యవహరిస్తుండగా, సాహు తో పాటూ చిరంజీవి కూతురు సుస్మిత కూడా నిర్మాణ భాగస్వామిగా ఉండనుంది. ఈ సినిమా ఓకే అయ్యే ముందే సుస్మిత తనతో సినిమా చేయాలని సంబరపడుతున్న విషయాన్ని సాహుకి చెప్పి ఆమెను కూడా ఈ మూవీలో భాగం చేసి కూతురి కోరికను నెరవేర్చారు చిరంజీవి. ఎట్టకేలకు ఎంతో కాలంగా సుస్మిత కన్న కల ఇవాళ నెరవేరింది.













