ఓరి దేవుడా.. ఇదేం హాట్ నెస్ : సమంత అందాల ప్రదర్శన పై సుస్మిత కొణిదెల
సమంత అందాల ప్రదర్శన మీద టాలీవుడ్ సెలెబ్రిటీలు ఆశ్చర్యపోతోన్నారు. ముఖ్యంగా నటీమణులు మాత్రం ఆ హాట్ నెస్ చూసి అందరూ ఉడికిపోతోన్నారు. మెగా డాటర్ చిరు పెద్ద కూతురు సుష్మిత కొణిదెల అయితే నోరెళ్లబెట్టేసినట్టుంది. సమంత అందాల ప్రదర్శనపై మెగా డాటర్ చిరు పెద్ద కూతురు సుష్మిత కొణిదెల ఆశ్చర్యపోయింది. సమంత హాట్ నెస్‌ను చూసి నోరెళ్లబెట్టేసింది. ఓరి దేవుడా.. ఇదేం హాట్ నెస్ (Omg
what this hotness) అన్నట్టుగా కామెంట్ పెట్టేసింది. ఇక సుష్మిత ఇలా పెడితే.. బాలీవుడ్, టాలీవుడ్ ఇతర నటీమణులు మాత్రం ఇంకో లెవెల్లో కామెంట్లు పెట్టేశారు. కామెంట్ల మోతతో సమంత అందాల ఆరబోత హాట్ టాపిక్‌గా మారింది. అలా సమంత అందాల మీద నందినీ రెడ్డి, మంచు లక్ష్మీ, హన్సిక, సాధన సింగ్, రుహాని శర్మ, సంయుక్తా హెగ్డే, అనుష్క శర్మ, లావణ్య, సోషల్ మీడియా ఇంఫ్లూయెన్సర్ నిహారిక, నీరజ కోన, విమలా రామన్ ఇలా ఎంతో మంది హీరోయిన్లు సమంత అందాలను చూసి షాక్ అవుతున్నారు.కన్నడ బ్యూటీ సంయుక్త హెగ్డే సైతం ఇలానే కామెంట్ చేసింది. ఇదేం అందాల ప్రదర్శన.. అంటూ అగ్గిరాజేస్తున్నావ్ అన్నట్టుగా ఫైర్ ఎమోజీలను షేర్ చేశారు. ఇక ఎవరైనా త్వరగా ఫైర్ ఇంజన్‌కు ఫోన్ చేయండి.. మంటలు ఆగేలా లేవు అంటూ మంచు లక్ష్మీ తన స్టైల్లోకామెంట్ చేసింది. మొత్తానికి సమంత హాట్ ఫోటో షూట్లు మాత్రం అందరిలోనూ చర్చకు తెరలేపింది. బాలీవుడ్ చాన్సుల కోసమే సమంత ఇలా అందాలను ప్రదర్శిస్తోందని టాక్ వినిపిస్తోంది. ఇక సమంత రణ్వీర్ సింగ్ కాంబినేషన్లో సినిమా ఫిక్స్ అయిందని, అందుకే ఈ ఇద్దరూ కలిశారని ఓ ఫోటోను ట్రెండ్ చేస్తున్నారు. మొత్తానికి సమంత మాత్రం బాలీవుడ్లో పాగా వేయాలని బాగానే ప్రయత్నిస్తున్నట్టు అర్థమవుతోంది. ఇప్పటికే ఈ పోస్ట్ ను రెండు మిలియన్స్ పైగా వీక్షించారు.
https://www.instagram.com/p/













