సుశాంత్ సింగ్ మరణం తట్టుకోలేక మొన్న వదిన, నిన్న ఓ అభిమాని మరణం
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం అభిమానులను, సన్నిహితులను, కుటుంబ సభ్యులను తీవ్రంగా కలిచివేస్తున్నది. సుశాంత్ ఇక లేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. అంత్యక్రియల రోజే వదిన మరణించడం తెలిసిందే. యువ హీరో మరణాన్ని తట్టుకోలేక ఓ అభిమాని కూడా ఆత్మహత్య చేసుకోవడం విషాదంగా మారింది. అభిమాని రాసిన సూసైడ్ నోట్లో గుండెను పిండేసే విధంగా తన బాధను వ్యక్తం చేసి ఆత్మహత్య చేసుకోవడం సెన్సేషనల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..
జూన్ 14వ తేదీన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణవార్త వెలుగు చూడగానే దేశ వ్యాప్తంగా ప్రజలు నివ్వరపోయారు. తన మరణవార్తతో మనస్తాపం చెందిన ఆయన వదిన సుధాదేవి ఆహారం, మెడిసిన్స్ తీసుకోవడం మానేయడంతో ఆరోగ్య పరిస్థితి విషమించి మరణించండం మరో విషాదంగా మారింది. ఈ విషాదం మరిచిపోకముందే మరో అభిమాని ప్రాణాలు తీసుకోవడం మరింత బాధగా మారింది.
ఉత్తరప్రదేశ్‌లోని బరేలి గ్రామానికి చెందిన అభిమాని సుశాంత్ మరణంతో తీవ్ర వేదనకు గురయ్యాడు. పదో తరగతి చదువుతున్న బాలుడు తాను అభిమానించే నటుడు ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఆ బాధలో సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకొని తుదిశ్వాస విడిచి కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చాడు. బాలుడి మరణం స్థానికంగా విషాదాన్ని నింపింది. సుశాంత్ అభిమాని ఆత్మహత్యకు కారణాలు తెలుపుతూ సూసైడ్ నోట్ రాశారు. మరణాంతరం పోలీసులు, కుటుంబ సభ్యులు ఆ సూసైడ్ నోటును స్వాధీనం చేసుకొన్నారు. సుశాంత్ చేసిన పని.. నేనెందుకు చేయకూడదు అంటూ తన సూసైడ్ లెటర్లో పేర్కోవడం ప్రతీ ఒక్కరిని భావోద్వేగానికి గురిచేసింది.
సినీ పరిశ్రమలో తనకు జరిగిన అన్యాయానికి మనస్తాపం చెందిన సుశాంత్ సింగ్ ముంబైలోని బంద్రా అపార్ట్మెంట్లో ఆత్మహత్య చేసుకోవడం సిని పరిశ్రమను కుదిపేసింది. ఆయన అంత్యక్రియలు సోమవారం జూన్ 15న ముంబైలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు.













