సుశాంత్ సింగ్ మృతిపై టాలీవుడ్ స్టార్స్ ట్వీట్స్
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతిపై యావత్ బాలీవుడ్ సినీ తారలు ఒక్కొక్కరుగా స్పందిస్తూనే ఉన్నారు. అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ ఘటన నిజం కాకుంటే బావుంటుందని అంటున్నారు. బాలీవుడ్ స్టార్స్ తో పాటు టాలీవుడ్ స్టార్స్ కూడా అతని మృతి పట్ల తీవ్ర మనోవేదనకు లోనవుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. వెంకటేష్, మహేష్ బాబు, జూ.ఎన్టీర్, రాంచరణ్, అల్లు అర్జున్, రామ్ గోపాల్ వర్మ, అనిల్ రావిపూడి, ప్రకాష్ రాజ్, అనసూయా భరద్వాజ్ సోషల్ మీడియాలో ఈ విధంగా ట్వీట్స్ చేశారు.
వెంకటేష్ ట్వీట్.
నీ మరణ వార్త వినడానికే చాలా బాధగా వుంది ఇంత చిన్నవయసులో ఎంతో ప్రతిభ సంపాదించావ్. నీ ప్రియమైన వారికీ నా ప్రగాఢ సంతాపం తెలియచేస్తున్నాను.
మహేష్ బాబు ట్వీట్..
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణవార్త గురించి తెలియగానే షాక్ అయ్యాను. పవర్ హౌజ్ లాంటి టాలెంట్ ఉన్న అతి తక్కువ వయసు ఉన్న హీరో. అతను ఆత్మకు శాంతి దొరకలని అనుకుంటున్నాను. అతని మృతిపట్ల కుటుంబ సభ్యులు మనోవేదనకు లోను కాకుండా ధైర్యంగా ఉండాలని ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నట్లు మహేష్ బాబు ట్వీట్ చేశారు.
జూ. ఎన్టీర్ ట్వీట్
సుశాంత్ సింగ్ మరణ వార్త విని షాక్ కు గురిఅయ్యాను ఒక ప్రతిభగల నటుడు లేడనే నమ్మశక్యం గా లేదు. అతని మరణం కుటుంబ సభ్యులు మనోవేదనకు లోను కాకుండా ధైర్యంగా ఉండాలని నా ప్రగాఢ సంతాపం తెలియచేస్తున్నాను.
రామ్ చరణ్ ట్వీట్
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ లేడని విన్న నేను షాక్ గురిఅయ్యాను. కొలవడానికి ప్రామాణికం లేని ప్రతిభ ఇంత తొందరగా వెళ్లిపోవడం భాదగా వుంది. అలాగే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మకు శాంతి చేకూరాలని కొరుకుంటున్నట్లు రాంచరణ్ పేర్కొన్నారు.
అల్లు అర్జున్ ట్వీట్..
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణవార్త తీవ్రంగా బాధ పడ్డాను. నేను నిజంగా ఆరాధించే మంచి నటుడు లేదనే వార్త కలచి వేసింది. అతని మరణం కుటుంబ సభ్యులు మనోవేదనకు లోను కాకుండా ధైర్యంగా ఉండాలని నా ప్రగాఢ సంతాపం తెలియచేస్తున్నాను.
రామ్ గోపాల్ వర్మ
విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఈ ఘటనపై ట్విట్టర్ ద్వారా స్పందించారు. బాలీవుడ్ మునుపెన్నడు అనుభవించని అత్యంత షాకింగ్ విషయం ఇదేనని అన్నారు. అతను ఇంకా యంగ్ గానే ఉన్నాడు. ఎంతో మంచి లైఫ్ ఉంది. అయినా ఎందుకు ఇలా చేశాడు అంటూ జేమ్స్ డీన్ మరియు హీత్ లెడ్జర్ మరణాల కంటే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం చాలా షాకింగ్ విషయం అని అన్నారు. అలాగే కరోనావైరస్ తో పాటు దేవుడు బాలీవుడ్‌కు మరో శాపం తెచ్చిపెట్టినట్లు తెలుస్తోందని అన్నారు.
ప్రకాష్ రాజ్… ట్వీట్..
మా కుటుంభం నుండి ఎన్నో వేల మైళ్ళు దూరం వెలికిపోయావా నాయనా. గొప్ప ప్రతిభ వున్నా నీవు ఇంత త్వరగా తనువూ చాలించడం భాద గాఉంది. ఈ అపారమైన బాధను భరించే శక్తి మీ ప్రియమైనవారికి ప్రసాదించమని భగవంతుడిని కోరుతున్నాను.
అనసూయ భరద్వాజ్..
నేను చాలా వినాశనానికి గురయ్యాను. ఈ భయంకరమైన వార్త గురించి తెలుసుకోవడానికి నాకు కొంత సమయం పట్టింది. మరో అద్భుతమైన వ్యక్తిని కోల్పోయాము. మరణం గురించి పదే పదే వినడం హృదయం బద్దలువుతోంది. అతని కుటుంబానికి నా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను అలాగే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మకు శాంతి చేకూరాలని కొరుకుంటున్నట్లు అనసూయ పేర్కొన్నారు.
అనిల్ రావిపూడి..
టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి కూడా సుశాంత్ మృతి షాకింగ్ గా ఉందని అన్నారు. అలాగే ఈ ఘటనతో మాటలేమి రావట్లేదనే విదంగా ఉందంటూ.. అతను ఆత్మకి శాంతి చేకూరాలని అన్నారు. సినిమా హీరోలతో పాటు దర్శకులు, నిర్మాతలు ఇలా చాలా మంది సుశాంత్ సింగ్ మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు..













